News April 14, 2025
NZB: దళితులను అవమానించడమే ప్రజా పాలనా?: కవిత

దళితులను అవమానించడమే ప్రజా పాలనా? అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X లో ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బట్టలు విప్పి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.
Similar News
News April 16, 2026
నిజామాబాద్: కీటక జనిత వ్యాధులపై నిఘా పెంచాలి – డీఎంహెచ్ఓ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో RDT పరీక్షలు పెంచాలని, వివరాలను IHIP పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

తెలంగాణ వర్సిటీ పాలక మండలి సభ్యుడిగా దండు స్వామి

డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ దండు స్వామిని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం గిరిరాజ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఇంగ్లీష్ విభాగం హెచ్‌ఓడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దండు స్వామి నియామకం పట్ల బర్దిపూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.