News October 12, 2024
NZB: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
Similar News
News February 4, 2025
NZB: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 4 మెడల్స్
జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన దినేష్ వాగ్మారే 4 మెడల్స్ సాధించాడు. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో 35 ఏళ్ల కేటగిరిలో ప్రాతినిధ్యం వహించిన దినేష్ లాంగ్ జంప్ లో సిల్వర్, రిలే లో సిల్వర్ మెడల్, ట్రిపుల్ జంప్‌లో బ్రాంజ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. దీంతో ఆయన వ్యక్తిగత ఖాతాలో మొత్తం నాలుగు మెడల్స్ నమోదు చేసుకున్నాడు.
News February 4, 2025
NZB: ప్రజావాణికి 141 ఫిర్యాదులు
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్ అర్జీలు అందజేశారు.
News February 4, 2025
NZB: నగరంలో నేడు పవర్ కట్
నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్3 ADE వీరేశం తెలిపారు. వినాయక్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో పలు మరమ్మతులు కారణంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. గాయత్రి నగర్, 1, 2, 3, 4, 5, ఆకుల పాపయ్య కాలనీ, చింత చెట్టు మైసమ్మ, కాశీనగర్, సిద్ధి వినాయక నగర్, కెనాల్ కట్ట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.