News October 16, 2024
NZB: దానిని తొక్కి పెడుతున్న CM రేవంత్: మంద కృష్ణ

అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన CM రేవంత్ రెడ్డి దానిని అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారని MRPS వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నిజామాబాద్ లో బుధవారం నిర్వహించిన MRPS, MSP అనుబంధ విభాగాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మాదిగలను మోసం చేసిన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.
Similar News
News November 20, 2025
నిజామాబాద్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, ఇందల్వాయి, రెంజల్, డొంకేశ్వర్, ఆలూర్, నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మోర్తాడ్, వేల్పూర్, మాక్లూర్, జక్రాన్ పల్లి, ఏర్గట్ల, కోటగిరి, పొతంగల్, వర్ని, మోస్రా మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 20, 2025
అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకుంటే పొరపాటే: వేముల

అక్రమ కేసులతో బీఆర్ఎస్, కేటీఆర్ను కట్టడి చేయాలనుకోవడం పొరపాటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుంటామని ఆయన స్పష్టం చేశారు.
News November 20, 2025
NZB: మూగజీవాలను సైతం వణికిస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రజలలో వణికిస్తున్న చలిపులి మూగజీవాలను సైతం వదలడం లేదు. చలికి మనుషులతో పాటు మూగజీవాలు కూడా గజగజ వణుకుతున్నాయి. కొందరు చలిమంట వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతుండగా వారు వేసుకున్న చలిమంట వద్ద మూగజీవాలు సేదదీరుతున్నాయి. NZB నగరంలో రెండు కుక్క పిల్లలు వెచ్చదనం కోసం ఇలా చలి మంటకాచుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


