News October 16, 2024

NZB: దానిని తొక్కి పెడుతున్న CM రేవంత్: మంద కృష్ణ

image

అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన CM రేవంత్ రెడ్డి దానిని అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారని MRPS వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నిజామాబాద్ లో బుధవారం నిర్వహించిన MRPS, MSP అనుబంధ విభాగాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మాదిగలను మోసం చేసిన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

Similar News

News November 4, 2024

ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలి: మందకృష్ణ

image

మాదిగలు అండగా నిలిచారని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొన్నారు. వర్గీకరణ అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాల వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

News November 3, 2024

ఒట్లు తీసి గట్టు మీద పెట్టిన సీఎం: ఎంపీ అర్వింద్

image

ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఒట్లు గట్టు మీద పెట్టేశారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోయాడన్నారు. రైతులకు రుణమాఫీ, బోనస్, కళ్యాణ లక్ష్మితోపాటు బంగారాన్ని మరిచారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

News November 3, 2024

NZB: చెరువులో మునిగి ఇద్దరు మృతి

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. . హైదరాబాద్‌కు చెందిన కొందరు ఆదివారం మంచిప్పలోని దర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం వీరిలో ఇద్దరు యువకులు సరదగా స్థానిక పెద్ద చెరువులో దిగగా.. నీట మునిగారు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు చెరువులో గాలించగా ఇద్దరి యువకుల మృతదేహలు లభ్యమయ్యాయి.