News January 19, 2025

 NZB: దాశరథి శతజయంతిని ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత

image

తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, పీడనపై అగ్నిధారను కురిపించిన కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లో ప్రధాన కూడలిలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కవిత లేఖ రాశారు.

Similar News

News December 4, 2025

మాక్లూర్: ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

image

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామంలో కూలీ పనులకు వచ్చిన బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ (25) సోమవారం రాత్రి భోజనం వద్ద గుడ్డు కుమార్‌తో ఘర్షణ పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గుడ్డు కుమార్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

News December 4, 2025

NZB: 3వ విడత తొలిరోజు 579 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా తొలిరోజు బుధవారం 579 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 174 మంది, 1,620 వార్డు మెంబర్ స్థానాలకు 405 మంది నామినేషన్లు వేశారు.

News December 3, 2025

NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

image

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్‌కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.