News April 9, 2024
NZB: దొంగ అనుకొని చెట్టుకు కట్టేశారు..!
మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగగా భావించి పోలీసులకు అప్పగించిన ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో చోటు చేసుకుంది. నిజామాబాద్ గాజుల్ పేటకు చెందిన గుండమల్ల గంగాధర్ ఎలుకుర్తి హవేలిలో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు వచ్చి అతన్నిపోలీస్ స్టేషన్ తరలించారు. గంగాధర్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
Similar News
News December 31, 2024
NZB: ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదు: MLC కవిత
పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మేడిగడ్డ విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న పిచ్చి ప్రయత్నంతో ఎస్సారెస్పీని ఎండబెట్టారన్నారు. ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు.
News December 30, 2024
KMR: DEC 31st.. రూల్స్ మస్ట్: ఎస్పీ
ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నిబంధనలు పాటిస్తూ..న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా SP సింధు శర్మ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. రోడ్లపై కేక్ కట్టింగ్, అల్లర్లకు పాల్పడడం వంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. డీజేలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆరోజు రాత్రి బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.
News December 30, 2024
NZB: ప్రతి పౌరుడు సహకరించాలి: ఇన్‌ఛార్జ్ CP
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. DEC 31న రాత్రి నిర్వహించే వేడుకలపై ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు పెడుతున్నట్లు NZB ఇన్ ఛార్జ్ సీపీ సింధు శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలు అందరికీ ఆమోదయోగ్యంగా, అహ్లదకరంగా, ఆరోగ్యంగా హాని రహితంగా ఉండాలని కోరారు. ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.