News June 15, 2024

NZB: ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో సమావేశమయ్యారు. ధరణిలో వివిధ మాడ్యూల్స్ కింద దాఖలైన దరఖాస్తులను తక్షణమే పరిశీలిస్తూ, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News January 10, 2026

నిజామాబాద్: రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పొతంగల్ (M) కొడిచర్లకు చెందిన సాయికుమార్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. జక్రాన్ పల్లి(M) పడకల్‌కు చెందిన తలారి నరేందర్ (35) సైతం ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. ఆలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్(M) 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ పవార్ (40) దుర్మరణం పాలయ్యాడు.

News January 9, 2026

టీయూ: అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు

image

టీయూ ఇంటర్ కాలేజ్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ను శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. తుదిపోరు నిశిత డిగ్రీ కళాశాల, గిరిరాజ్ కళాశాల మధ్య జరగగా నిశిత కళాశాల విజేతగా నిలిచింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డా.రాంబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ నేత, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు.

News January 9, 2026

బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్‌కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.