News February 6, 2026

NZB: ధర్నాలో పాల్గొన్న STU సభ్యులు

image

అఖిల భారత టీచర్స్ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో వద్ద నిర్వహించిన ధర్నాలో NZB స్టేట్ టీచర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. CPSను రద్దు చేసి OPS పునరుద్దరణ చేయాలని కోరారు. 2010 ముందుగా నియామకమైన టీచర్స్‌ను TET నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తొలగించాలని డిమాండ్ చేశారు. NZB అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.