News October 6, 2024

NZB: నాలుగు క్వింటాళ్ల పండ్లతో అన్నపూర్ణ దేవీగా అమ్మవారు

image

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవీగా దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్‌లో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నాలుగు క్వింటాళ్ల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఇందుకోసం రూ.50 వేలు వెచ్చించి 15 రకాల పండ్లు కొనుగోలు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు చేపడున్నామన్నారు.

Similar News

News October 15, 2025

నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ సజావుగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

News October 15, 2025

నిజామాబాద్: బీసీ బంద్‌కు సీపీఎం మద్దతు

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఆరోపించారు. బుధవారం బీసీ జేఏసీ నాయకులు కలిసి ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు మద్దతు కోరగా, సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ల తీర్మానానికి కేంద్రం తక్షణమే ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలని రమేష్‌బాబు కోరారు.

News October 15, 2025

NZB: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి: బస్వా లక్ష్మీనర్సయ్య

image

వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై కమీషనర్‌ను బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు