News August 26, 2024
NZB: నిజామాబాద్లో మాంసం విక్రయాలు బంద్
నేడు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా నిజామాబాద్లో మాంసం విక్రయాలు నిర్వహించవద్దని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని చేపలు, మేకల మాంసం విక్రయాలు, చికెన్ సెంటర్లు, ఇతర మాంసాహార దుకాణాల నిర్వాహకులు ఈ విషయం గమనించాలన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. ఈ ఉత్తర్వును తూ.చా తప్పక పాటించాలన్నారు.
Similar News
News September 9, 2024
లింగంపేట్: మటన్ ముక్క కోసం గొడవ
మటన్ ముక్కల కోసం కామారెడ్డి జిల్లాలో ఆదివారం గొడవ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో భోజనాల సమయంలో బంధువులకు మటన్ ముక్కలు తక్కువగా వేశారని వడ్డించే వారిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వారు రాజీ పడ్డారని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
News September 9, 2024
సిరికొండ: వినాయక మండపం వద్ద కరెంట్ షాక్తో బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో తాళ్లతండాలో కరెంట్ షాక్తో బాలుడు మృతి చెందాడు. తండాలోని వినాయక మండపం వద్ద సంజీవ్(16) మైక్ సరిచేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
News September 9, 2024
అలీ సాగర్ గేట్లను ఏ క్షణమైనా ఎత్తవచ్చు: ఏఈ రాజ్యలక్ష్మి
ఎడపల్లి మండలంలోని అలీ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఏ క్షణమైన ఎత్తే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ ఏఈ రాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నందున ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. దిగువ ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ విషయమై గ్రామాల్లో దండోరా వేయించాలని ఏఈ రాజ్యలక్ష్మి తెలిపారు.