News March 18, 2025
NZB: నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు నూతన బస్సులు

నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దిపేటకు నూతన ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు NZB-2 డిపో మేనేజర్ సాయన్న సోమవారం తెలిపారు. ఈ బస్సులు నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు నడపనున్నట్లు వెల్లడించారు. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను ఆదరించాలని తెలిపారు.
Similar News
News April 23, 2025
తల్లిదండ్రులూ.. పిల్లల కంటే మార్కులు ఎక్కువ కాదు!

టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనో, తక్కువ మార్కులొచ్చాయనో విద్యార్థులు సూసైడ్ చేసుకొని జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. ఈ సమయంలో ఫెయిలైన పిల్లల తల్లిదండ్రులు వారిని దగ్గరికి తీసుకొని, ఫెయిల్ అయినంత మాత్రాన అంతా అయిపోదనే భరోసా కల్పించండి. తక్కువ మార్కులొస్తే మరొకరితో పోల్చి సూటిపోటి మాటలు అని చిన్ని హృదయాలకు భారం అవ్వొద్దు. ఈ వయసులో వారు తట్టుకోలేక కఠిన నిర్ణయాలు తీసుకొనే ప్రమాదం ఉంది.
News April 23, 2025
బిక్కనూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాష్ర్ట సహకార అధికారి

బిక్కనూర్ మండలం బస్వాపూర్‌తో పాటు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రాష్ట్ర సహకార అధికారి ఫణీంద్రరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో వారికి మంచినీటి వసతి, టెంటు సౌకర్యం కల్పించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా సహకార అధికారి రామ్మోహన్ ఉన్నారు.
News April 23, 2025
పాకిస్థాన్‌కు భారత్ దెబ్బ?

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ, దౌత్యపరంగా పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా స్థావరాలపై దాడి
*ఆ దేశంతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం
*సింధు నదీజలాల ఒప్పందం రద్దు
*ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర గురించి భారత్ UN సెక్యూరిటీ ప్రతినిధులకు, 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టే యోచన.