News November 19, 2024
NZB: నిలకడగా మేయర్ భర్త శేఖర్ ఆరోగ్యం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఆటో డ్రైవర్ రసూల్ చేతిలో గాయాలపాలైన మేయర్ భర్త దండు శేఖర్ కోలుకుంటున్నారు. ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతున్నాడు. సుత్తి తో దాడి చేయడంతో కణితి భాగంలో తీవ్ర గాయం కాగా, వైద్యులు శస్త్ర చికిత్స అందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. శేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Similar News
News November 24, 2024
KMR జిల్లాలో సంక్షేమానికి చేసిన ఖర్చు వివరాలు
జిల్లాలో 23 శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. PM కిసాన్ సమ్మాన్ నిధికి రూ.531.6 కోట్లు, మధ్యాహ్న భోజనం రూ.9.68 కోట్లు, ఉపాధి హామీ పథకం రూ.73 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.36.75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.61.25 కోట్లు, RRRకు రూ.16.63 కోట్లు, MP లాడ్స్కు రూ.59.37 లక్షలు, PM ఆదర్శ్ గ్రామ యోజన పథకానికి రూ.49.50 లక్షలు ఖర్చు చేశామన్నారు.
News November 23, 2024
KMR: దిశ సమావేశంలో పాల్గొన్న MP, MLA
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమష్టి సహకారంతో పనిచేయాలని MP సురేశ్ షెట్కార్ అన్నారు. శనివారం దిశ సమావేశంలో ఎమ్మెల్యే KVRతో కలిసి ఆయన పాల్గొన్నారు. 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత మొదటి దిశ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు.
News November 23, 2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకు గమనిక
త్వరలో నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్- కరీంనగర్ పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది పట్టభద్రులు, టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అర్హులు ఇంకా ఎవరైనా ఉండవచ్చన్న అనుమానంతో డిసెంబర్ 9 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి అయిన వాళ్లు ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.