News November 19, 2024
NZB: నిలకడగా మేయర్ భర్త శేఖర్ ఆరోగ్యం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఆటో డ్రైవర్ రసూల్ చేతిలో గాయాలపాలైన మేయర్ భర్త దండు శేఖర్ కోలుకుంటున్నారు. ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతున్నాడు. సుత్తి తో దాడి చేయడంతో కణితి భాగంలో తీవ్ర గాయం కాగా, వైద్యులు శస్త్ర చికిత్స అందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. శేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Similar News
News December 13, 2024
బిచ్కుంద ఐటీఐ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్
బిచ్కుంద ఐటీఐ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆయన రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఐటీఐలో అడ్మిషన్ కాకముందు ఏం చదివారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ కాలంలోనే స్వయం ఉపాధి, ఉద్యోగం సాధించవచ్చునని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
News December 13, 2024
కామారెడ్డి: పాల బిల్లులు చెల్లించాలని వినతిపత్రం అందజేత
రైతులకు పెండింగ్ పాల బిల్లుల ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా విజయ డెయిరీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి డీడీసీఎఫ్ రాష్ట్ర ఛైర్మన్ అమిత్‌రెడ్డికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. రైతులకు పాల బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చూడాలని కోరారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఛైర్మన్ అమిత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
News December 13, 2024
నిజాంసాగర్: రైతు సంక్షేమానికి పెద్ద పీట: మంత్రి ఉత్తమ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు పక్ష పాతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటి విడుదల అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగుచేసిన రాష్ట్రాల్లో TG మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. నాగమడుగు ఎత్తి పోతల పథక పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తానని మంత్రి హామి ఇచ్చారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.