News January 31, 2025
NZB: నీళ్ల విషయంలో ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుంది: కవిత

నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే కాకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News February 17, 2025
NZB: రైలులో యువతి గొలుసు చోరీ

రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన రేణుక తన స్నేహితులతో కలిసి బాసరకు వెళ్లి రైలులో తిరుగు ప్రయాణమైంది. రైలులో కిటికీ పక్కన కూర్చోగా జానకంపేట స్టేషన్ క్రాసింగ్ వద్ద ట్రైన్ ఆగింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి కిటికీలోంచి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.
News February 17, 2025
NZB: ఏసీ బస్సుల్లో 10% తగ్గింపు: ఆర్టీసీ RM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు ఏసీ బస్సుల టికెట్ ఛార్జీలపై 10% రాయితీ కల్పించినట్లు NZB ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఈ రాయితీ ఏసీ స్లీపర్, ఏసీ సీటర్, రాజధాని బస్సులకు వర్తిస్తుందని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.
News February 16, 2025
NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఐఈఓ

నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యశాఖ అధికారి రవికుమార్ తనిఖీ చేశారు. అదేవిధంగా జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దీన్, కనకమహాలక్ష్మి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మరో 12 కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా డీఐఈఓ పరిశీలించారు.