News September 10, 2024
NZB: నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నెల 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలనలో కార్డులు లేనివారికి ఇస్తారా? కుటుంబీకుల పేర్లు జత చేర్చుతారా? ప్రస్తుతం ఉన్నవారికి కొత్తకార్డులు ఇస్తారా తెలియాల్సి ఉంది. అయితే కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని అధికారులు వెల్లడించారు.
Similar News
News December 16, 2025
NZB: 60 సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్ఠమైన నిఘా: CP

తుది విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలలో ఉన్న 60 సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. 24 ఎఫ్.ఎస్.టీ టీమ్స్, 4 ఎస్.ఎస్.టీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో మొత్తం 194 మందిని సంబంధిత తహశీల్దారుల ముందు హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు వివరించారు.
News December 16, 2025
నిజామాబాద్: ఎన్నికలు.. 11 గన్లు డిపాజిట్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల వద్ద ఉన్న గనులను డిపాజిట్ చేయాల్సిందిగా సీపీ సాయి చైతన్య ఆదేశించారు. మొత్తం 18 మంది వద్ద గన్ లైసెన్స్లు ఉండగా వారిని డిపాజిట్ చేయమన్నామన్నారు. ఇందులో నుంచి 11 గన్లు తమవద్ద డిపాజిట్ అయ్యాయని, మిగతా 7 గన్ లైసెన్సులు బ్యాంకుకు సంబంధించినవని కమిషనర్ వివరించారు.
News December 16, 2025
NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.


