News March 11, 2025

NZB: నూతన సీపీ సాయి చైతన్య నేపథ్యమిదే

image

2016 బ్యాచ్‌కు చెందిన సాయి చైతన్య ఐఐటీ బెనారస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ నిజామాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. గతంలో కాటారం, ములుగు ఏఎస్పీగా, వరంగల్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డీసీపీగా, హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీగా పని చేశారు.

Similar News

News March 11, 2025

సాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి: కలెక్టర్

image

ఎండుతున్న పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే అన్వేషించాలని వ్యవసాయ శాఖ అధికారులను, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ధర్పల్లి, సిరికొండ మండలాల్లో క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే యాసంగిలో నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసుకునే విధంగా రైతులను చైతన్యపరచాలన్నారు.

News March 11, 2025

NZB: పసుపు పంట విక్రయాలపై పకడ్బందీ పర్యవేక్షణ: కలెక్టర్

image

నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో పసుపు పంట విక్రయాలపై లోతైన పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా, మోసాలకు గురికాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. పసుపు క్రయవిక్రయాల నిశిత పరిశీలనకై సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులకు అండగా ఉండాలన్నారు.

News March 11, 2025

NZB: పోలీస్ స్టేషన్‌లో వ్యక్తికి సంకెళ్లు

image

పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తితో వెట్టి చాకిరి చేయించిన ఘటన బోధన్‌లో జరిగింది. ఓ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి ఆ వ్యక్తితో పోలీస్ స్టేషన్‌ను ఊడిపించారు. కానిస్టేబుల్ గంగాధర్ ముందే పోలీస్ స్టేషన్‌లో చీపురుతో క్లీన్ చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

error: Content is protected !!