News September 27, 2024

NZB: నేటి నుంచి DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

2008 DSC ద్వారా 70, 30% ఎంపికైన తెలుగు మీడియం SGT అభ్యర్థులకు ఈ నెల 27- అక్టోబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని NZB DEO దుర్గాప్రసాద్ తెలిపారు. అభ్యర్థులకు సంబంధించిన జాబితాను www.schooledu.telangana.gov.in వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో కూడిన 2 జిరాక్సు సెట్లతో ఉదయం 10:30 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు.

Similar News

News November 27, 2025

NZB: మొదటి విడతలో ఓటేసే వారు ఎంతమంది అంటే?

image

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో 11 మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికల్లో 2,61,210 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. ఇందులో మహిళలు 1,37, 413 మంది, పురుషులు 1,23,790 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఇందు కోసం 1,653 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వివరించారు.

News November 27, 2025

NZB: శుభముహూర్తం చివరి రోజు.. భారీ నామినేషన్లకు అవకాశం!

image

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో ఈసారి సర్పంచ్‌గా నిలబడి గ్రామానికి సేవ చేయాలనే ఆశతో ఎన్నో ఏళ్లుగా పూజలు, వ్రతాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న స్థానిక నాయకుల్లో నామినేషన్ ఉత్సాహం ఉప్పొంగుతోంది. మొదటి విడత 184 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలకు గురువారం శుభముహూర్తం చివరి రోజు కావడం, రేపటి నుంచి మూఢాలు ప్రారంభం అవుతున్న క్రమంలో నేడు భారీ సంఖ్యలో నామినేషన్లు నేడే వేసే అవకాశాలు ఉన్నాయి.

News November 27, 2025

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు: కలెక్టర్

image

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించినట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించినట్లు పేర్కొన్నారు.