News September 27, 2024
NZB: నేటి నుంచి DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
2008 DSC ద్వారా 70, 30% ఎంపికైన తెలుగు మీడియం SGT అభ్యర్థులకు ఈ నెల 27- అక్టోబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని NZB DEO దుర్గాప్రసాద్ తెలిపారు. అభ్యర్థులకు సంబంధించిన జాబితాను www.schooledu.telangana.gov.in వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో కూడిన 2 జిరాక్సు సెట్లతో ఉదయం 10:30 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు.
Similar News
News October 5, 2024
NZB: GREAT.. ఒకేసారి ఐదు ఉద్యోగాలు
నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.
News October 5, 2024
కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు
కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
News October 5, 2024
NZB: ఆన్లైన్ బెట్టింగ్… ముగ్గురు ఆత్మహత్య!
ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన రంగననేని సురేష్, హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. దీంతో ఆ కుటుంబం అప్పులపాలైంది. వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మివేసినా అప్పు తీరకపోవడంతో ముగ్గురు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.