News January 21, 2025
NZB: నేటి నుండి 24 వరకు ప్రజా పాలన వార్డు సభలు

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల 21 నుంచి 24 వరకు వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగరంలోని 60 డివిజన్లలో 7 బృందాలు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు దశల వారీగా ఈ సభలు నిర్వహిస్తారని కమిషనర్ చెప్పారు. ఇందులో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 10, 2026
నిజామాబాద్: రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పొతంగల్ (M) కొడిచర్లకు చెందిన సాయికుమార్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. జక్రాన్ పల్లి(M) పడకల్‌కు చెందిన తలారి నరేందర్ (35) సైతం ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. ఆలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్(M) 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ పవార్ (40) దుర్మరణం పాలయ్యాడు.
News January 9, 2026
టీయూ: అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు

టీయూ ఇంటర్ కాలేజ్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ను శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. తుదిపోరు నిశిత డిగ్రీ కళాశాల, గిరిరాజ్ కళాశాల మధ్య జరగగా నిశిత కళాశాల విజేతగా నిలిచింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డా.రాంబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ నేత, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు.
News January 9, 2026
బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్‌కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


