News August 12, 2024

NZB: నేడు ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్‌లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి 1గంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 15, 2024

NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

నిజామాబాద్ నగరంలోని బాబన్ సాహబ్ పహాడ్ లో తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. బాబన్ సాహబ్ పహాడ్‌కుచెందిన షేక్ అబ్బుత్ ఆలిక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న ఉన్న 2 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు 5వ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.

News September 15, 2024

రుద్రూర్: గణనాథునికి 108 రకాల నైవేద్యాలు

image

రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ నవయుగ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకునికి భక్తులు ఆదివారం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. లడ్డూలు, గారెలు, చెకోడీలు, అరిసెలు, బొబ్బట్లు, పండ్లు ,పాయసం, పులిహోర, స్వీట్లు ఇతర రకాల నైవేద్యాలను భక్తులు తయారుచేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News September 15, 2024

వినాయకుడికి పూజలు నిర్వహించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

image

కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ దంపతులు శనివారం రాత్రి పట్టణంలోని వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని దయతో వర్షాలు సమృద్ధిగా కురిశాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారిని వినాయక మండప నిర్వాహకులు సన్మానించారు.