News January 19, 2025

NZB: నేడు నగరానికి రానున్న ఎమ్మెల్సీ కవిత

image

నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం నగరానికి రానున్నారు. ఇటీవల ప్రారంభించిన పసుపు బోర్డు అంశంపై ఆమె మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారు. ఎల్లమ్మ గుట్టలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగల గణేశ్ గుప్తా, జడ్పీ మాజీ ఛైర్మన్ విట్టల్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Similar News

News January 19, 2025

ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు: కవిత

image

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని, కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ వెకిలి మాటలు మాట్లాడడం మానేయాలని ఆమె సూచించారు.

News January 19, 2025

NZB: నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం NZB రానున్నారు. రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసి గూపన్పల్లిలో, నగరంలో బహిరంగ సభల్లో మాట్లాడి హైదరాబాద్ తిరుగపయనమవుతారు.

News January 19, 2025

నేడు నిజామాబాద్‌కు డీజీపీ

image

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్‌ను మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో DGP పాల్గొంటారు. ఇందు కోసం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.