News February 5, 2025

NZB: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా..!

image

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించి భద్రపరిచారు. ఆర్మూర్ డివిజన్‌లో 180 పంచాయతీలుండగా బోధన్ డివిజన్ 152, నిజామాబాద్ డివిజన్‌లో 213 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు పార్టీ నేతలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

Similar News

News February 17, 2025

KMR: అన్న బెదిరింపు.. హత్య చేసిన తమ్ముళ్లు

image

మేడ్చల్‌లో సంచలనం రేపిన <<15484237>>హత్య<<>> కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్(25), రాకేశ్, లక్ష్మణ్‌ అన్నదమ్ములు. మద్యానికి బానిసైన ఉమేశ్‌ వేధింపులు తాళలేక అతడిని దుబాయ్ పంపుదామని ఇంట్లో ప్లాన్ చేశారు. ఇష్టంలేని అతడు ఆ ప్లాన్ చెడగొట్టాడు. ఆదివారం ఇంట్లో ఉన్న తమ్ముళ్లను బెదిరించడంతో వాళ్లు ఎదురుతిరిగారు. ఉమేశ్ పారిపోతుండగా నడిరోడ్డుపై అతడిని దారుణంగా చంపేశారు.

News February 17, 2025

ముప్కాల్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామ శివారులోని చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. తెలుపు & బూడిద రంగు డబ్బాల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఎత్తు 5.6 అంగులాలు ఉన్నట్లు వెల్లడించారు. వివరాలు తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.

News February 17, 2025

NZB: అమ్మవారి ముక్కపుడక చోరీ

image

నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గొల్లగుట్ట తాండాలోని జగదాంబ సేవాలాల్ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయం తాళాలు పగులకొట్టిన దొంగలు అమ్మవారి బంగారు ముక్కు పుడక ఎత్తుకెళ్లారు. ఈ మేరకు గ్రామస్థులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు.

error: Content is protected !!