News February 20, 2025
NZB: పంటల విక్రయాలను పర్యవేక్షించాలి: కలెక్టర్

ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభమైనందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ రైతుల వద్ద నుంచి పంటను సేకరించేలా చూడాలన్నారు.
Similar News
News February 22, 2025
24న నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న CM రేవంత్ రెడ్డి నిజామాబాద్‌కు వస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు.
News February 22, 2025
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేసి మాట్లాడారు.
News February 22, 2025
నిజామాబాద్: నగదు, బంగారం చోరీ

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు, బంగారం అపహరించిన ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం వెలుగు చూసింది. హాబీబ్ నగర్ కాలనీకి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లగా అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెళ్లి కోసమని అప్పు తెచ్చిన రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.