News September 19, 2024

NZB: ‘పండుగ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’

image

NZB కమిషనరేట్ ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సీపీ కల్మేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకలకు పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు సైతం చేసిందని దీనికి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని మతాల పెద్దలు స్వచ్చందంగా సహకరించారని వెల్లడించారు.

Similar News

News October 20, 2025

NZB: రియాజ్ మృతిపై ప్రమోద్ కుటుంబం హర్షం

image

నిజామాబాద్ జిల్లాలోని కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి పట్ల ఆయన భార్య ప్రణీత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు.

News October 20, 2025

NZB: CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం

image

CCS కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్‌ను పోలీసులు కాల్చడంతో పోలీసులపై, CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

News October 20, 2025

మెండోరా: నీటిలో మండుతున్న సూర్యుడు

image

సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సూర్యుడు ఎరుపెక్కిన దృశ్యాన్ని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్‌పై నుంచి చూస్తే నీటిలో నిప్పు కనిక మండుతున్నట్లుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పర్యాటకులు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్లలో ఫొటోలను చిత్రీకరించారు. నీటిలో నుంచి మండుతున్న అగ్నిపైకి వస్తున్నట్లు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో పర్యాటక శోభ సంతరించుకుంది.