News January 31, 2025
NZB: పట్టభద్రులు మేల్కోండి… నేడే చివరి రోజు

ఉమ్మడి నిజామాబాద్,కరీంనగర్, మెదక్, అదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ చేస్తామనుకున్న వారు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుగా దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఓటర్ నమోదుకు ఇదే చివరి అవకాశం కానుంది.
Similar News
News November 8, 2025
పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్ను అడిగి తెలుసుకున్నారు.
News November 7, 2025

MP అర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు

గత BRS ప్రభుత్వంపై నిజామాబాద్ MPఅర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. KCR కుటుంబం చేసిన పాపానికి CM రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని పేర్కొన్నారు.