News November 5, 2024
NZB: పట్టభద్రులు మేల్కోండి.. రేపే చివరి రోజు!

ఉమ్మడి NZB జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల ప్రచార సందడి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రులను కలుస్తూ నవంబర్ 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. సోమవారం నాటికి ఉమ్మడి జిల్లాలో 24,187 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. మరి మీరు అప్లై చేశారా? కామెంట్ చేయండి.
Similar News
News December 13, 2025
నిజామాబాద్: పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా: బీజీపీ అధ్యక్షుడు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యనారాయణ రూ.138 కోట్ల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాలన శూన్యమన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
News December 13, 2025
NZB: మరదలిపై అత్యాచారం చేసిన బావకు పదేళ్ల జైలు శిక్ష

మరదలిపై అత్యాచారం చేసిన బావకు నిజామాబాద్ జిల్లా మహిళా కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ 10 సంవత్సరాల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2019లో సాయినాథ్ అనే వ్యక్తి భార్య ఇంటి వద్ద లేని సమయంలో NZBలో ఉండే మరదలి వద్దకు వెళ్లి మీ అక్క రమ్మంటోందని చెప్పి బైక్ పై తీసుకెళ్లి ఇంట్లో అత్యాచారం చేశాడు. సాక్షాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేశారు.
News December 13, 2025
NZB: మద్యం దుకాణాలు బంద్

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయనున్నామని NZB జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నట్లు తెలిపారు.


