News March 6, 2025
NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
Similar News
News March 27, 2025
సోషల్ మీడియాలో నటి ప్రైవేటు వీడియో లీక్

తమిళ నటికి చెందిన ఓ ప్రైవేట్ వీడియో X, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. 14 నిమిషాల నిడివి గల ఆ వీడియో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతానికి నిదర్శనమని సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విటర్‌లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. మరోవైపు వీడియో ఆ నటిది కాదని, ఆమె ముఖాన్ని ఎడిట్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నటికి ఇన్‌స్టాలో 420K ఫాలోవర్లున్నారు.
News March 27, 2025
రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న అంజలి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపకే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.
News March 27, 2025
ఖమ్మం: కేంద్రమంత్రికి MP వద్దిరాజు వినతి

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు పామాయిల్ (ఆయిల్ ఫాం) తోటల సాగుకు అనువైన, సారవంతమైనవని మంత్రికి వివరించారు. పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.