News February 14, 2025
NZB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
Similar News
News September 15, 2025
నెతన్యాహుకు ట్రంప్ బిగ్ వార్నింగ్

ఖతర్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుకు US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖతర్ తమ మిత్రదేశమని, జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇటీవల ఖతర్‌లోని దోహాలో దాక్కున్న హమాస్ కీలక నేతలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
News September 15, 2025
చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.
News September 15, 2025
NLG: 17 నుంచి పోషణ మాసం షురూ

ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమంగా భావించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నల్గొండ జిల్లాలోని 2,093 అంగన్వాడి కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహించనుంది. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు చూసి రిజిస్టర్లో నమోదు చేయనున్నారు.