News January 19, 2025

NZB: పథకాలపై కలెక్టరేట్‌లో సమీక్ష ప్రారంభం

image

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్, రాకేశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

డిసెంబర్ నెలలో పర్వదినాలు

image

DEC 1: గీతా జయంతి, సర్వ ఏకాదశి
DEC 2: మత్స్య, వాసుదేవ ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి
DEC 3: హనమద్ర్వతం, DEC 4: దత్త జయంతి
DEC 8: సంకటహర చతుర్థి
DEC 12: కాలభైరవాష్టమి
DEC 14: కొమురవెళ్లి మల్లన్న కళ్యాణం
DEC 15: సర్వ ఏకాదశి
DEC 16: ధనుర్మాసం ప్రారంభం
DEC 30: ముక్కోటి ఏకాదశి

News December 1, 2025

చిరు-వెంకీ సాంగ్.. 500 మంది డాన్సర్లతో షూటింగ్

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుంచి ఓ అప్డేడ్ చక్కర్లు కొడుతోంది. గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి మెగాస్టార్-విక్టరీ వెంకటేశ్‌ కాంబినేషన్‌లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 500 మంది డాన్సర్లతో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు చెప్పాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని 2026 సంక్రాంతి బరిలో నిలపనున్నారు.

News December 1, 2025

మెదక్: ఏకగ్రీవం దిశగా మల్కాపూర్ తండా పంచాయతీ

image

మెదక్ మండలం మల్కాపూర్ తండాలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2019లో జరిగిన ఎన్నికల్లో సైతం ఏకగ్రీవం చేశారు. మొదటి సర్పంచ్ గా సరోజను ఎన్నుకున్నారు. ఈసారి దారావత్ బన్సీని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో మల్లన్నగుట్ట తండా నుంచి సరోజ ఉండగా ఈసారి మల్కాపూర్ తండా నుంచి బన్సీ సర్పంచ్ కానున్నట్లు సమాచారం.