News October 21, 2024

NZB: ‘పదవుల కేటాయింపులో వారికి రెండో ప్రాధాన్యం’

image

వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పదవుల కేటాయింపులో రెండో ప్రాధాన్యం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల కృషి తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. కష్టపడే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటుందని హామీ ఇచ్చారు.

Similar News

News November 5, 2024

నిజామాబాద్: DSP పదవికి రాజీనామా.. MLCగా బరిలో..

image

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్‌ DSP విధులకు రిటైర్మెంట్ ప్రకటించారు. త్వరలో పట్టభద్రుల MLC అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వరుసగా 12 PSలకు ఆయన SHOగా విధులు నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

News November 5, 2024

నిజామాబాద్ DEO దుర్గా ప్రసాద్ హైదరాబాద్ బదిలీ

image

నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) NVదుర్గా ప్రసాద్ హైదరాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా నిజామాబాద్ డైట్ కళాశాల లెక్చరర్ పి.అశోక్ ను నియమించారు.

News November 4, 2024

లండన్‌లో పర్యటిస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే

image

తెలంగాణ అధికార పర్యటనలో భాగంగా ఈ నెల 5,6,7 తేదీల్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో పాల్గొనేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెళ్లారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా వారి పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు వీరికి ఘన స్వాగతం పలికారు.