News March 1, 2025
NZB: పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కీలక సూచనలు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కీలక సూచనలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు, కాపీయింగ్ జరగకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షల అనంతరం ఆన్సర్ షీట్లను నిర్ణీత పాయింట్ కు తరలించే జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News December 13, 2025
నిజామాబాద్: పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా: బీజీపీ అధ్యక్షుడు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యనారాయణ రూ.138 కోట్ల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాలన శూన్యమన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
News December 13, 2025
NZB: మరదలిపై అత్యాచారం చేసిన బావకు పదేళ్ల జైలు శిక్ష

మరదలిపై అత్యాచారం చేసిన బావకు నిజామాబాద్ జిల్లా మహిళా కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ 10 సంవత్సరాల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2019లో సాయినాథ్ అనే వ్యక్తి భార్య ఇంటి వద్ద లేని సమయంలో NZBలో ఉండే మరదలి వద్దకు వెళ్లి మీ అక్క రమ్మంటోందని చెప్పి బైక్ పై తీసుకెళ్లి ఇంట్లో అత్యాచారం చేశాడు. సాక్షాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేశారు.
News December 13, 2025
NZB: మద్యం దుకాణాలు బంద్

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయనున్నామని NZB జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నట్లు తెలిపారు.


