News March 14, 2026

NZB: పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్: సీపీ

image

నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని 144 కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు సీపీ పి.సాయి చైతన్య తెలిపారు. పరీక్షా సమయాల్లో కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Similar News

News April 13, 2026

నిప్పుల కొలిమి నిజామాబాద్.. 40 దాటిన టెంపరేచర్

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత ‘అలర్ట్’ స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6, నిజామాబాద్ సౌత్ 41.5°C, ​పెర్కిట్ (ఆర్మూర్):41.5°C, ​యెడపల్లి: 41.5°C మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 13, 2026

నిజామాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా

image

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ఫలితాల గణాంకాలపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా వెనుకబడటం చర్చనీయాంశమైంది. ప్రథమ సంవత్సరంలో 56.64% ఉత్తీర్ణతతో 25వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో పరిస్థితి మరింత దిగజారి 66.19% ఉత్తీర్ణతతో 29వ ర్యాంకుకు పడిపోయింది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో మార్పు రావాలా.. విద్యావ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేస్తున్నారు.

News April 12, 2026

BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

image

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.