News May 21, 2024
NZB: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716278664220-normal-WIFI.webp)
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. ఈ నెల 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని మొత్తం 18,288 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
Similar News
News February 13, 2025
NZB: తొమ్మిదిన్నర తులాల బంగారం చోరీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373583819_50486028-normal-WIFI.webp)
NZBలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సౌత్ CI సురేశ్ తెలిపారు. అర్సపల్లిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్ ఆఫ్తాబ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసి నగలను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు CI తెలిపారు. నిందితుడు నుంచి తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.15 వేల నగదు, 2 వాచ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
News February 13, 2025
మోర్తాడ్: జాతీయస్థాయి కబడ్డీకి ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739348139224_52305189-normal-WIFI.webp)
మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన కుంట సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందించారు. తుది జట్టు ఎంపిక తర్వాత ఒడిషా రాష్టంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.
News February 13, 2025
NZB: 70 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739351566532_50139228-normal-WIFI.webp)
భద్రత కోసం మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మహిళా జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 70 శాతం పనిచేయడం లేదని ఆరోపించారు.