News October 22, 2024
NZB: పలు హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, జరిమానాలు

నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న వంట గదులను గమనించి శుభ్రంగా ఉంచాలని హెచ్చరించి, ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించామన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న శాతవాహన హోటల్ కు రూ.2000 జరిమానా విధించినట్లు చెప్పారు.
Similar News
News November 21, 2025
ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి నిజామాబాద్ రచయితకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి NZB జిల్లాకు చెందిన రచయిత ప్రేమ్ లాల్ ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి పిలుపు రావడం పట్ల ప్రేమ్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. సాహితీ మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
News November 21, 2025
NZB: గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: TPCC చీఫ్

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్-2025లో NZBకు చెందిన నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడా గౌరవాన్ని మరోసారి ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
News November 21, 2025
SRSP: 947.474 TMCల వరద

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.


