News January 15, 2025

NZB: పసుపు బోర్డుతో అందరికీ లాభం: MP అర్వింద్

image

పసుపు బోర్డుతో కేవలం పసుపు రైతులకే ఉపయోగం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారని, కానీ దాని వల్ల అందరికీ లాభం ఉంటుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పారు. నిజామాబాద్‌లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతులకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 

Similar News

News February 7, 2025

NZB: ఫారెస్ట్ అధికారి హత్య.. దోషికి జీవిత ఖైదు

image

నిజామాబాద్ జిల్లాలో 2013లో ఇందల్వాయి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గంగయ్య దారుణ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఆ కేసులో దోషిగా తేలిన భాస్కర్‌కు హైకోర్టు జీవిత కారాగార శిక్షను ఖరారు చేసింది. మిగతా 13 మందిని నిర్దోషులుగా పేర్కొన్నారు. కాగా 2017లో మొత్తం 17 మందిలో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News February 7, 2025

కోటగిరి: తల్లి, తనయుడు అదృశ్యం

image

కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన బండారి జ్యోతి(24) తన ఒకటిన్నర సంవత్సరాల కొడుకుతో అదృశ్యమైనట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బిడ్డతోపాటు వెళ్లిపోయింది. జ్యోతికి మాటలు రావని ఆచూకీ తెలిసినవారు కోటగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News February 7, 2025

NZB: చోరీకి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్

image

బైకు చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ మల్లేష్, జక్రాన్‌పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన సాయన్న  బైక్ ఈనెల 5వ తేదీన చోరీకి గురైంది. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మనోహరాబాద్‌లో రాకేశ్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బైకును రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 

error: Content is protected !!