News March 14, 2025

NZB: పసుపు బోర్డు ఎక్కడుందో నాకే తెలియదు: AMC ఛైర్మన్

image

జిల్లాలో ఏర్పాటు చేశామని చెబుతున్న పసుపు బోర్డు ఎక్కడ ఉంది నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయిన తనకే తెలియదని, ఇంకా రైతులకు ఎలా తెలుస్తుందని ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పసుపు బోర్డు అని ప్రైవేట్ హోటల్‌లో దానిని ప్రారంభించారని అందుకు రైతులను, మార్కెట్ కమిటీలను పిలువకుండా కేవలం పార్టీ కార్యకర్తలతో కార్యక్రమం చేయించారని విమర్శించారు.

Similar News

News October 26, 2025

కాంగ్రెస్ మునిగిపోయే నావ: కవిత

image

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, వారితో తనకు పని లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజల నుంచే దిక్కు లేదని, తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని ఆమె ఎద్దేవా చేశారు.

News October 26, 2025

నిజామాబాద్: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి: కవిత

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామాతో శ్రీకారం చుట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె నిజామాబాద్‌ నగర శివారులోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్‌తో పాటు తెలంగాణలోని బీజేపీకి చెందిన 8 మంది రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. తక్షణమే వారు రాజీనామా చేయాలన్నారు.

News October 26, 2025

నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

image

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.