News February 23, 2025
NZB: పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలి

మహాశివరాత్రి సందర్భంగా లేబర్ హాలిడే కారణంగా ఫిబ్రవరి 26 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని అలాగే మార్చి 1, 2 తేదీలలో శనివారం, ఆదివారం గంజ్ తెరిచి ఉన్న పసుపుకు సంబంధించిన లావాదేవీలు ఉండవని అధికారులు తెలిపారు. తిరిగి మళ్లీ మార్చ్ 3న ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 23, 2025
NZB: యువతిపై సామూహిక అత్యాచారం

ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఓ యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. బాధితురాలితో ఉన్న మరో యువతి ఘటనాస్థలి నుంచి పారిపోయి గ్రామస్థులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతులను NZB నుంచి కారులో తెచ్చారని, మద్యం మత్తులో ఉన్నారని సమాచారం.
News February 23, 2025
శెట్పల్లిలో చెరువులో మృతదేహం లభ్యం

మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన బండ్ల భీమన్న(55) అనే వ్యక్తి చెరువులో పడి మరణించాడు. నాలుగు రోజుల నుంచి కనిపించకపోయినా ఆయన మృతదేహం చెరువులో లభ్యమైంది. నాలుగు రోజుల కిందట లక్ష్మీ కాల వద్దకు వెళ్లి అందులో స్నానం కోసం దిగగా బయటకు రాలేదు. కాలువ ప్రవాహానికి కొట్టుకొచ్చి చెరువులో శివమై తేలాడు. తమ్ముడు రాజన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై విక్రమ్ తెలిపారు.
News February 23, 2025
అర్సపల్లి రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి

అర్సపల్లి రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. గుర్తు తెలియని రైలు ప్రమాదంలో మరణించిన మృతురాలి వయస్సు సుమారు 50 వరకు ఉంటుందన్నారు. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఎస్ఐ చెప్పారు. మృతురాలిని గుర్తిస్తే 8712658591 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సాయిరెడ్డి కోరారు.