News March 9, 2025
NZB: పాఠ్యాంశంగా రమేశ్ కార్తీక్ నాయక్ కవి పద్యం

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్ ఆంగ్లంలో రాసిన’లైఫ్ ఆన్ పేపర్ ‘అనే కవితను బళ్ళారి (కర్ణాటక) శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంగ్లిష్ – మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్‌లో పాఠ్యాంశంగా పొందుపరిచింది. ఇది ఒక గాఢమైన భావోద్వేగ కవిత అని దీనిని పాఠ్యాంశంగా చేర్చడం పట్ల కార్తీక్ హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 21, 2025
సామర్లకోట: రైలు నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తూ కిందికి జారిపడడంతో తలకు బలమైన గాయమై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే పోలీస్టేషన్ పరిధిలో జి.మేడపాడు స్టేషన్ వద్ద గురువారం జరిగింది. ప్రమాద సమయంలో కొన ఊపిరితో ఉన్న యువతిని రైల్వే ఉద్యోగులు గుర్తించి చికిత్స నిమిత్తం సామర్లకోట తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.
News March 21, 2025
నల్గొండ: 25న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

నల్గొండ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య, వ్యాయామ విద్యను బోధించేందుకు ఎంపీఈడీ, దృశ్యకళలు, ప్రదర్శన కళలు బోధించేందుకు ఎంపీఏ/ఎంఎఫ్ఏ/బీఎఫ్ఏ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. SHARE IT.
News March 21, 2025
NRPT: పరీక్షల కోసం కఠిన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

జిల్లా పరిధిలో పదో తరగతి పరీక్షల సందర్భంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 144 సెక్షన్ & 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేష్ గౌతం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరంలో ఐదుగురికిపైగా గుంపులు, ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిషేధం అన్నారు. విద్యార్థులు సమయానికి బయలుదేరి, రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.