News March 3, 2025

NZB: పానీపూరి తిని కత్తితో దాడి

image

ఓ వ్యక్తి పానీపూరి తిని.. రూ.10 డబ్బులు అడిగిన సదరు చిరు వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. నగరంలోని శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరు వ్యాపారి ఆకాశ్ పానీపూరీ బండి నడిపిస్తున్నారు. హర్మీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆకాశ్‌ వద్ద పానీపూరి తిన్నాడు. అనంతరం ఆకాశ్ డబ్బులు అడిగాడు. నన్నే అడుగుతావా అంటూ హర్మీత్ సింగ్ చిన్న చాకుతో ఆకాశ్ వేళ్ళు కోశాడు.

Similar News

News March 4, 2025

ఆలూర్: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో గుత్ప వాసి మృతి

image

ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు పెరగడంతో గత ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పని చేస్తుండగా ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మరణించాడు. సోమవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.

News March 4, 2025

UPDATE: NZB: లంచం తీసుకున్న ఇద్దరి అరెస్ట్

image

ఫిర్యాదుదారుని పేరు మీద ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు రూ.10 వేలు లంచం తీసుకున్న కేసులో సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిజామాబాద్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II చెన్న మాధవాణి శ్రీరామ రాజు, కార్యాలయ స్వీపర్ రంగసింగ్ వెంకట్ రావులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ అదనపు కోర్టులో హాజరు పరచనున్నట్లు వారు వివరించారు.

News March 4, 2025

NZB: రాష్ట్రస్థాయి టైక్వాండోలో జిల్లాకు మెడల్స్

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి మెడల్స్ సాధించారు. ఇందులో భాగంగా 27 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారని అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ మనోజ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ ఛైర్మన్ బస్వాపురం లక్ష్మీ నరసయ్య విజేతలను  అభినందించారు.

error: Content is protected !!