News January 3, 2025
NZB: పాముతో చెలగాటం ఆడుతున్న బాలురులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు చిన్న పిల్లలు పాములతో ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. ఈ ఘటన గురువారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం ముఖ ద్వారం వద్ద చోటుచేసుకుంది. పీల స్కూల్ సమీపంలో పామును పట్టుకొని కొందరు పిల్లలు ఆటలాడుతూ తిరిగారు. కొంచెమైనా భయం లేకుండా పాముతో చెలగాటం ఆడుతూ సెల్ఫీలు దిగారు. పిల్లలపై స్థానిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News July 5, 2025
NZB: ప్రణాళికబద్ధంగా కృషి చేయాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, నివేశన స్థలాల క్రమబద్దీకరణ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు.
News July 5, 2025
NZB: 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

బాసర జోన్-2లో పని చేస్తున్న 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి లభించింది. వీరిని నిజామాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రియాజుద్దీన్, జక్రయ్య, పరమేశ్వర్, వసంతరావు, అరుణ కుమారి, అనురాధ, రమనేశ్వరి, ముంతాజ్ బేగం, సతీశ్ కుమార్ ASIలుగా పదోన్నతి పొందారు.
News July 5, 2025
డొంకేశ్వర్ మండలం నుంచి 41 మంది IIITకి ఎంపిక

డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.