News February 1, 2026
NZB: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు… MP స్టాండ్ ఏమిటి?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో NZB MP అర్వింద్ ధర్మపురి నిధుల గురించి ఏం మాట్లాడతారోనని పార్లమెంట్ పరిధి వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా 500 బెడ్‌ల ESI ఆసుపత్రి నిర్మాణం, పార్లమెంట్ పరిధిలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల ఓపెనింగ్, నిధుల అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి MP తీసుకెళ్తారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.