News January 24, 2025
NZB: పీయూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ అర్వింద్

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై వారు చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరగా పసుపు బోర్డు కార్యక్రమాలను మొదలుపెడతామని స్పష్టం చేశారు.
Similar News
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.