News May 31, 2024

NZB: పురుగుల మందు సేవించి మహిళ ఆత్మహత్య

image

కొడుకుతో చిన్న పాటి గొడవ కారణంగా తల్లి పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. NZB నాగారంలో లక్ష్మీ అనే మహిళ, కొడుకు చెప్పిన మాట వినకపోవడంతో రెండు రోజుల క్రితం గొడవపడింది. దీంతో మనస్తాపానికి చెందిన లక్ష్మి, ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఐదవ టౌన్ ఎస్ఐ అశోక్ తెలిపారు.

Similar News

News February 12, 2025

NZB: విచారణ కోసం తీసుకెళ్లారు.. వ్యక్తి సూసైడ్ అటెంప్ట్

image

విచారణ నిమిత్తం తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన NZBలో కలకలం రేపింది. గూపన్పల్లిలో ఓ డాక్టర్ షెడ్‌లో పని చేస్తున్న బోధన్ మండలం కల్దుర్కికి చెందిన రాజును ముగ్గురు వ్యక్తులు వచ్చి ఓ చోరీ కేసు విషయంలో విచారణ కోసం తీసుకెళ్లినట్లు అతడి భార్య లక్ష్మి తెలిపారు. కాగా అనంతరం అతడు గడ్డి మందు తాగడని, దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 12, 2025

KMR: కోళ్లకు వైరస్.. కట్టడికి అధికారుల చర్యలు

image

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాథోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం కోళ్ల ఫామ్‌లో ఒకే సారి 8 వేలకుపైగా కోళ్లు మృతిచెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కోళ్ల దిగుమతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కట్టడిపై ఫోకస్ పెట్టారు.

News February 12, 2025

NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

ఇంటికి తాళం వేసి కుటుంబం కుంభమేళాకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో నివాసం ఉండే శేఖర్ కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లారు. కాగా అదే రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోని 2 తులాల బంగారం, 40 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.

error: Content is protected !!