News June 26, 2024
NZB: పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు: రాష్ట్ర కార్యదర్శి కరుణ
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. జిల్లా కలెక్టర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. పిల్లల పోషక లోపాల నివారణ కట్టుదిట్టమైన చర్యలను చేపట్టి ప్రాథమిక విద్యకేంద్రాలుగా మార్చాలని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
NZB: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత
అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.
News February 9, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయింది వీరే
డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులో శనివారం సాయంత్రం కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిచ్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆర్యనగర్కు చెందిన గణేశ్, నరేశ్, రమేశ్, జగన్గా గుర్తించారు. కరీంనగర్ ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మారంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. గాయాలైన యువకులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.
News February 9, 2025
NZB: ప్రజావాణి తాత్కాలిక వాయిదా: కలెక్టర్
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని వివరించారు.