News March 7, 2025
NZB: పెళ్లిలో గొడవ.. వ్యక్తి మృతి

పెళ్లిలో గొడవ జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ వివరాలు.. ఎల్లారెడ్డికి చెందిన రాములు(42) ముగ్దంపూర్ గ్రామంలో చుట్టాల ఇంటికి పెళ్ళికి వెళ్లాడు. పెళ్లి కూతురును తీసుకురావడానికి పంపకపోవడంతో గొడవ జరిగింది. మద్యం తాగి ఉన్న రాములు స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 22, 2025
NZB: ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఛైర్మన్‌గా ఈగ సంజీవ్

ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏథిక్స్ డిసిప్లేన్ చైర్మన్‌గా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఒక ప్రకటన లో తెలిపారు. సంజీవ్ రెడ్డి ఎంపిక పట్ల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్ అంద్యాల లింగయ్యా, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
News March 22, 2025
నిజామాబాద్: ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

లేఔట్ల క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎల్ఆర్ఎస్ సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఎఫ్‌టీఎల్, నిషేధించిన సర్వే నంబర్లు మినహా దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించిందని కలెక్టర్ సూచించారు
News March 22, 2025
NZB: తపాలా వివాదాల పరిష్కారానికి డాక్ అదాలత్

నిజామాబాద్ తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 25న 49వ డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్ జనార్ధన్ తెలిపారు. పోస్టల్ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న మనీ ఆర్డర్, స్పీడ్ పోస్ట్, బీమా, ఆర్‌డీ పథకాలు తదితర సమస్యలు సంబంధిత అధికారులు పరిష్కారిస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.