News June 19, 2024

NZB: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

image

నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి జరిపారు. హైమద్ పురా కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, సిబ్బంది లక్ష్మన్న, రాములు, గజేందర్, అనిల్ కుమార్, సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు జరిపారు. ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకుని రూ.7,460 నగదు సీజ్ చేశారు. ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.

Similar News

News September 20, 2024

TU: ఎంఎడ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎంఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 28 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌ను సంప్రందించాలని సూచించారు.

News September 19, 2024

NZB: ‘పండుగ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’

image

NZB కమిషనరేట్ ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సీపీ కల్మేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకలకు పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు సైతం చేసిందని దీనికి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని మతాల పెద్దలు స్వచ్చందంగా సహకరించారని వెల్లడించారు.

News September 19, 2024

NZB: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిఖత్ బుధవారం డీజీపీ జితేందర్‌ను కలిసి తన జాయినింగ్ ఆర్డర్ అందజేశారు.