News February 26, 2025

NZB: పోలింగ్ సామాగ్రి పంపిణీ పరిశీలించిన కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించి నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్  పరిశీలించారు.

Similar News

News February 27, 2025

సిల్వర్ మోడల్ సాధించిన NZB అమ్మాయి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంహిత హర్యానాలో జరిగిన నెట్‌బాల్ పోటీల్లో విజయం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి సంహితను సిల్వర్ మోడల్‌తో సత్కరించారు. వినాయక్ నగర్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. చిన్న వయసులోనే తెలంగాణ నుంచి నెట్‌బాల్ క్రీడా విభాగంలో మెడల్ సాధించిన జట్టు క్రీడాకారులందరిని జిల్లా క్రీడాధికారి ముత్తన్న బుధవారం అభినందించారు.

News February 26, 2025

NZB: శివాలయానికి వెళ్లొచ్చే సరికి మూడిళ్లలో చోరీ

image

శివరాత్రికి దేవాలయాలకు వెళ్లి వచ్చే సరికి అగంతకులు తాళం వేసిన మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గంగస్థాన్ నుంచి కేశాపూర్ వెళ్ళేదారిలో రియల్టర్ బలరాం రెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం, ఆర్టీసీ కాలనీలోని రవీందర్ ఇంట్లో 2 తులాల బంగారం, ఏక శిలా నగర్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలోని కిరాణ వ్యాపారి రవీందర్ ఇంట్లో రూ.60 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 26, 2025

NZB: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈ నెల 23న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మహిళ మృతి చెందింది. మృతురాలిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రఘుపతి సూచించారు.

error: Content is protected !!