News March 14, 2025

NZB: పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి

image

NZBలో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు..పెద్దపల్లి, జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు సంపత్, చిరంజీవి కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు.తీరా అక్కడికి వెళ్లిన వారికి పని లేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్,చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.

Similar News

News March 20, 2025

బాలం రాయి హై స్కూల్‌ను సందర్శించిన మంత్రి, కలెక్టర్

image

విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని HYD ఇన్‌‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ నల్లగుట్ట బాలంరాయి హైస్కూల్​లో ఎఫ్ఎల్ఎన్, ఏఎక్సెల్ ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి, DEO ఉన్నారు.

News March 20, 2025

విజయవాడలో అగ్నిప్రమాదం

image

విజయవాడలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మాచవరం పోలీసుల వివరాల మేరకు బందర్ రోడ్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద కిచెన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెస్టారెంట్‌లోని కిచెన్ మొత్తం దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2025

గద్వాల: ‘పదో తరగతి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి’

image

గద్వాల జిల్లాలో మార్చ్ 21 – ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. సరైన సౌకర్యాలు లేని కారణంగా ప్రతి ఏడాది పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, సరైన మరుగుదొడ్లు లేకపోవడం, కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేక, సమయానికి బస్సులు రాక సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!