News July 31, 2024

NZB: పోలీసుల పేరుతో ఫోన్ చేస్తే స్పందించొద్దు: సీపీ

image

సైబర్ నేరగాళ్లు పోలీసుల ఆఫీసర్ల పేరుతో ఫోన్ చేస్తే స్పందించవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ప్రజలను హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పోలీసు ఆఫీసర్ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ.. కొత్త విధానానికి తెరలేపారని అన్నారు. సైబర్ మోసాలపై స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News October 11, 2024

కామారెడ్డి: ఈ ఊళ్లో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం

image

కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్‌లో సద్దుల బతుకమ్మ రోజు కుటుంబ సభ్యుల్లోని మగవారు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పెద్ద బతుకమ్మలను ఎత్తుకుంటారు. ఏటా ఇలాగే ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు జరుపుకొంటారు. కేవలం మహిళలకే పరిమితం కాకుండా మగవారు కూడా బతుకమ్మ ఉత్సవాలు ముగిసే వరకు సమయం కేటాయిస్తారు.

News October 10, 2024

కామారెడ్డి : లింగాకృతిలో బతుకమ్మ

image

లింగాకృతిలో బతుకమ్మను మహిళలు తయారు చేశారు. ఆ బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంటుంది. కామారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డు విద్యుత్‌నగర్ కాలనీ, దేవుపల్లికి చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వైద్య ఉమారాణి థర్మాకోల్ ఉపయోగించి శివలింగాకృతిలో పూలతో బతుకమ్మ తయారుచేసి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రకృతిపరంగా, ఆధ్యాత్మికపరంగా ఈ బతుకమ్మ ఎంతో శోభను కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు.

News October 10, 2024

కామారెడ్డి: అక్క ఆత్మహత్యాయత్నం.. బాధతో చెల్లి సూసైడ్

image

కామారెడ్డి జిల్లాలో బుధవారం విషాద ఘటన జరిగింది. వివరాలు.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మమతకు మోషంపూర్ వాసితో పెళ్లైంది. వారిమధ్య మనస్పర్థలు రాగా పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేసింది. బాధతో ఆమె చెల్లి ప్రత్యూష సైతం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రత్యూష చనిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.