News January 16, 2025

NZB: పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నాం: జీవన్ రెడ్డి 

image

కాంగ్రెస్ కొమ్ము గాస్తున్నా పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నామని ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. హోం మంత్రిత్వశాఖను కూడా నిర్వ హిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వరెస్ట్ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి అరెస్టుల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బందాలా..? అని ఆయన మండిపడ్డారు. 

Similar News

News October 19, 2025

రైఫిల్ షూటింగ్లో సత్తా చాటిన ఆర్మూరు FBO సుశీల్

image

అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలో ఆర్మూరు రేంజ్ FBO బాస సుశీల్ కుమార్ ప్రతిభ కనబరిచారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలో రాష్ట్ర సాయి పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాసర జోన్ లెవెల్లో నిర్వహించిన మెన్స్ రైఫిల్ షూటింగ్లో మొదటి విజేతగా సుశీల్ నిలిచారు. అలాగే హైదరాబాదులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీల్లో 2వ విజేతగా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు.

News October 19, 2025

నిజామాబాద్: 3,500 ఎకరాలల్లో ఆయిల్ పామ్ సాగు: కలెక్టర్

image

లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగుకు తగు సూచనలు చేశారు.

News October 19, 2025

నిజామాబాద్: ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్ చేసుకోవాలి: కలెక్టర్

image

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటనే అన్ లోడింగ్ చేసుకునేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుద్రూర్, పొతంగల్, కోటగిరి మండలం కొత్తపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.